సీరియస్ సబ్జెక్ట్ లో కామెడీ ఏంటి సురేష్ బాబూ ?

By Newsmeter.Network  Published on  7 Dec 2019 2:16 PM GMT
సీరియస్ సబ్జెక్ట్ లో  కామెడీ ఏంటి  సురేష్ బాబూ ?

'ఎఫ్ 2' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ 'వెంకీమామ'గా డిసెంబర్ 13న రాబోతున్నాడు. కాగా వెంకీ తన తరువాత సినిమాల్ని కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెలుగులోకి రీమేక్ చేయబోతున్నాడు. తమిళ్ హీరో ధనుష్, మంజు వారియర్ కలయికలో తెరకెక్కిన ఈ అసురన్ సినిమాని.. తెలుగులో కొన్ని మార్పులు చేర్పులు చేసి తీయబోతున్నారు. మెయిన్ గా వెంకటేష్ కామెడీ టైమింగ్ కి తగ్గట్లు కొన్ని కొత్త కామెడీ సీక్వెన్స్ ను కూడా రాపిస్తున్నారు. అయితే వెంకటేష్ క్యారెక్టర్ సీరియస్ గానే సాగిన.. ఆ సీరియస్ నెస్ లో వెంకటేష్ చేసే యాక్టివిటీస్ తో ఫన్ జనరేట్ అయ్యేలా చేయాలని మేకర్స్ ను సురేష్ బాబు ఆదేశించినట్లు సమాచారం.

ఐడియా బాగానే ఉంది గాని, అసలు సీరియస్ సబ్జెక్ట్ లో కామెడీ ఎలా సింక్ అవుతుందో మరి. సురేష్ బాబుకి అంత తొందరగా కథలు నచ్చవు అనే టాక్ ఇండస్ట్రీలో బాగా ఉంది. ఆ కారణంగానే సూపర్ హిట్ స్టోరీలను కూడా ఆయన మిస్ చేసుకున్నారనే రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో రెగ్యులర్ గా వినిపిస్తాయి. ఈ అసురన్ ను వెట్రిమారన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించి తమిళనాట సంచలన విజయం అందుకున్నారు. అలాంటి స్క్రిప్ట్ లో కూడా సురేష్ బాబు మార్పులు చేయించడం అవసరమా అని డైరెక్టర్ ఫీల్ అవుతున్నాడట. మరి సురేష్ ప్రొడక్షన్స్ లో సినిమా అంటే అలాగే ఉంటుంది. అన్నట్లు ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు వి క్రియేషన్స్ సంస్థ కూడా సంయుక్తంగా నిర్మించనుంది. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు. అదీ కూడా సురేష్ బాబుకు స్క్రిప్ట్ పూర్తిగా నచ్చితేనే.

Next Story