అరె.. సురేష్ బాబేనా.. వందల కోట్లను !

By Newsmeter.Network  Published on  12 Dec 2019 2:04 PM GMT
అరె.. సురేష్ బాబేనా.. వందల కోట్లను !

భారీ సెట్టింగ్ ల దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్ లో బహుభాషా నటుడు రానా హీరోగా రానున్న భారీ ప్రాజెక్ట్ చిత్రం 'హిరణ్య కశ్యప'. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది నవంబర్ నుండి ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమా గురించి రానా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అత్యంత అధునాతనమైన టెక్నాలజీని ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నామని.. అందువలనే సినిమా కాస్త ఆలస్యం అయిందని తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమానికి సంబంధించిన సెట్ వర్క్ హైదరాబాద్‌ లోని రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది. కీలక సన్నివేశాల కోసం రామానాయుడు స్టూడియోలో కొన్ని ప్రత్యేకమైన సెట్లు వేస్తున్నారు. అన్నట్లు రానా మరో స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. 'హిరణ్య కశ్యప' చిత్రాన్ని 'బాహుబలి' కంటే గొప్పగా తీయాలని.. అలాగే రూపొందిస్తామని చెపుకొచ్చాడు.

ముఖ్యంగా ఈ సినిమాలో విఎఫ్‌ఎక్స్‌ వర్క్ అద్భుతంగా ఉండేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. అందుకు అనుగుణంగానే పక్కా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు షాట్ డివిజన్, ఫొటోగ్రఫీ బ్లాక్స్ లాంటి వర్క్ లను.. హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసే బృందం చేత ఈ సినిమాకి వర్క్ చేయిస్తున్నారట. ఏమైనా హిరణ్య కశ్యప సినిమా తమ బ్యానర్ లోనే అత్యంత భారీ సినిమాగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రూపాయి ఖర్చు పెట్టాలన్నా.. వంద సార్లు ఆలోచించే సురేష్ బాబు ఈ సినిమాకు వందల కోట్లు ఖర్చు పెట్టడం నిజంగా విశేషమే. ఈ క్రేజీ సినిమా పురాణగాధల్లో ఒకటైన 'హిరణ్య కశ్యపుడు - భక్త ప్రహల్లాద'ల కథ ఆధారంగా రూపొందడటం కూడా ఈ సినిమా పై అంచనాలను పెంచుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Next Story
Share it