ప్ర‌తి రోజు పండ‌గే ట్రైల‌ర్ టాక్ ఏంటి..?

By Newsmeter.Network  Published on  5 Dec 2019 11:06 AM GMT
ప్ర‌తి రోజు పండ‌గే ట్రైల‌ర్ టాక్ ఏంటి..?

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన‌ చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. యువ ద‌ర్శ‌కుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే... స‌త్య‌రాజ్ కి క్యాన్స‌ర్ అడ్వాన్స్ స్టేజ్.. మ‌హా అయితే.. ఐదు వారాలు బ‌తుకుతాడు అని డాక్ట‌ర్ చెబుతాడు. కొడుకులు ఎక్క‌డో ఉంటారు. ఇలాంటి టైమ్ లో మ‌న‌వ‌డు ఏం చేసాడు..? తాత‌ను ఎలా హ్యాపీగా ఉంచాడు..? అనేదే ఈ క‌థ అని తెలుస్తుంది. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే.. ఇటీవ‌లే రిలీజ్ అయిన తోలుబొమ్మ‌లాట సినిమా గుర్తుకు వ‌స్తుంది.

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ఈ క‌థ‌ను సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసార‌ట‌. అలాగే ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ క‌థ విని బాగుందని చెప్పార‌ట‌. ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ నెల 20న ఈ సినిమా రిలీజ్ కానుంది. మ‌రి... ట్రైల‌ర్ తో మెప్పించింది.. సినిమా ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Next Story
Share it