"ప్ర‌తి రోజు పండ‌గే" విజ‌యం వాళ్ల‌దే - అల్లు అర‌వింద్

By Newsmeter.Network  Published on  26 Dec 2019 10:37 AM GMT
ప్ర‌తి రోజు పండ‌గే విజ‌యం వాళ్ల‌దే - అల్లు అర‌వింద్

సాయి తేజ్ మరో డిఫరెంట్ హిట్ అందుకున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన “ప్రతి రోజు పండగే” సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న చిత్ర యూనిట్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇక బుధవారం చిత్ర యూనిట్ “ప్రతి రోజు పండగే” విజయోత్సవ సభను రాజమండ్రిలో నిర్వహించి సక్సెస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది.

రాజమండ్రిలోనే “ప్రతి రోజు పండగే” విజయోత్సవ సభ ని నిర్వహిస్తామని అనుకోలేదు. ఎక్కువ భాగం షూటింగ్ ఇక్కడే జరిగింది. అయితే ఇక్కడే ఈవెంట్ ని నిర్వహించాలని అల్లు అరవింద్ నిర్ణయించుకున్నారు. మొదట్లో ఈ సక్సెస్ మీట్ సక్సెస్ అవుతుందో లేదో అని భయపడ్డాను. కానీ మన రాజమండ్రి వారే దాన్ని సక్సెస్ చేసారు. తేజు అంటే నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారికి తేజు అంటే ఇష్టం. అలాంటి పర్సన్ కి ఇంతటి మంచి విజయాన్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు నిర్మాత బన్నీ వాసు.

ఈ చిత్ర విజయం ఇద్దరిదని చెప్పాలి. మారుతి – సాయి తేజ్ ఇద్దరు కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అందరికంటే ఎక్కువగా ఈ విజయం వారికే దక్కుతుందన్నారు మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్. సినిమా చూసి ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తమన్ సంగీతం, మారుతి దర్శకత్వం, సాయి తేజ్ నటన ఇలా అన్ని ఈ సినిమాకు కాలిసొచ్చాయి. సినిమా సక్సెస్ అయిన సందర్బంగా మరిసారి చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.

Next Story
Share it