పాపం.. రాజ్ త‌రుణ్‌

By Newsmeter.Network  Published on  26 Dec 2019 9:57 AM GMT
పాపం.. రాజ్ త‌రుణ్‌

ఉయ్యాలా జంపాలా, "కుమారి 21 ఎఫ్‌", "సినిమా చూపిస్త మామ" చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు యువ హీరో రాజ్ త‌రుణ్‌. ఆత‌ర్వాత స‌రైన క‌థ‌లు ఎంచుకోక‌పోవ‌డంతో వ‌రుస ఫ్లాపుల‌తో కెరీర్ లో బాగా వెన‌క‌బ‌డ్డాడు. "ఇద్ద‌రి లోకం ఒక‌టే" సినిమా పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఎంత‌లా అంటే... రెమ్యూన‌రేష‌న్ కూడా తీసుకోకుండా... సినిమా స‌క్స‌స్ అయిన త‌ర్వాత అప్పుడు తీసుకుటాను అని చెప్పాడ‌ట‌.

షూటింగ్ జ‌రుగుతున్న టైమ్ లో కేవ‌లం త‌న ఖ‌ర్చుల‌కు మాత్ర‌మే తీసుకున్నాడ‌ట‌. త‌న స్టాఫ్ కి కూడా త‌నే స్వ‌యంగా డ‌బ్బులు ఇచ్చాడ‌ట‌. ఎందుకిలా చేసాడంటే.. సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంది. అప్పుడు వ‌చ్చిన లాభాల్లో వాటా తీసుకుందాం అనుకున్నాడు కానీ... రాజ్ త‌రుణ్ ఫ్లాన్ వ‌ర్క‌వుట్ కాలేదు. "ఇద్ద‌రి లోకం ఒక‌టే" ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఎందుకిలా జ‌రిగిందో అర్ధం కాక బాగా డీలాపడ్డాడ‌ట‌.

అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి సినిమా వ‌స్తుంది అంటే అంచ‌నాలు ఉంటాయి కానీ.. ఈ సినిమా ఏ ద‌శ‌లోను బ‌జ్ క్రియేట్ చేయ‌లేక‌పోయింది. ఈ మూవీ ఆడుతున్న ధియేట‌ర్లు జ‌నం లేక ఖాళీగా ఉన్నాయ‌ట‌. వ‌రుస ఫ్లాపుల్లో ఇదోక ఫ్లాపు అని స‌రిపెట్టుకోలేక‌పోతున్నాడ‌ట రాజ్ త‌రుణ్. ఎందుకంటే.. త‌న జ‌డ్జెమెంట్ ఎందుకు క‌రెక్ట్ కాలేదో అర్ధం కావ‌డం లేద‌ని స‌న్నిహితుల ద‌గ్గ‌ర చెప్పి బాధ‌ప‌డుతున్నాడ‌ట‌. పాపం.. రాజ్ త‌రుణ్. మ‌ళ్లీ.. ఎప్పుడు స‌క్సస్ వ‌స్తుందో..?

Next Story