వెంకీ అసుర‌న్ రీమేక్ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

By అంజి  Published on  6 Dec 2019 5:04 AM GMT
వెంకీ అసుర‌న్ రీమేక్ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించ‌ని లేటెస్ట్ మూవీ వెంకీ మామ‌. మేన‌ల్లుడు నాగ చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన వెంకీ మామ సినిమా డిసెంబ‌ర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ త‌ర్వాత వెంకీ అసుర‌న్ రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌మిళ్ ధ‌నుష్ న‌టించిన ఈ మూవీ వెంకీకి బాగా న‌చ్చేసింద‌ట‌.

అంతే... వెంట‌నే ఈ రీమేక్ లో న‌టించేందుకు ఓకే చెప్పాసాడు. ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ మ‌రియు వి క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం శ్రీకాంత్ అడ్డాల త‌న టీమ్ తో క‌లిసి వైజాగ్ లో స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. త్వ‌ర‌లో షూటింగ్ స్టార్ట్ చేసి స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. వెంకీ మామ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న వెంకీ అసుర‌న్ రీమేక్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా చేస్తున్నాను అని తెలిసిన త‌ర్వాత ఇండ‌స్ట్రీలో త‌న‌కు క్లోజ్ గా ఉండే వాళ్లు చాలా మంది ఫోన్ చేసి మీకు ఆ క‌థ సెట్ కాదు... మీరు చేయ‌ద్దు అని చెప్పార‌ట కానీ... వెంకీ మాత్రం ఎందుకు సెట్ కాదు నేను చేస్తాని చెప్పార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెంక‌టేష్ మీడియాకి చెప్ప‌డం విశేషం.

Next Story
Share it