స్టార్ డమ్ కోసం.. ఈ తెలుగు బ్యూటీ రోజు రోజుకి..!

By అంజి  Published on  8 Dec 2019 3:13 AM GMT
స్టార్ డమ్ కోసం.. ఈ తెలుగు బ్యూటీ రోజు రోజుకి..!

తెలుగు బ్యూటీ ఇషా రెబ్బా కెరీర్ పరంగా ఆమె ఆశించేది ఒకటి.. కానీ ఆమెకు దక్కుతుంది మరొకటి అన్నట్లు ఉంది ఈ అమ్మడు పరిస్థితి. రీసెంట్ గా 'రాగల 24 గంటల్లో' సినిమాతో హిట్ కొట్టిన తనకు మాత్రం సరైన గుర్తింపు రావడంలేదని అమ్మడు తెగ ఇధైపోతూ ఫీలైపోతుందట. నిజానికి మొదటినుంచీ ఇషాకి బాగానే అవకాశాలొచ్చినా ఆశించిన స్థాయిలో విజయాలు అయితే దక్కలేదు. దాంతో పెద్దగా స్టార్ డమ్ కూడా సంపాదించలేకపోయింది. అందుకే చివరికీ ఈ మధ్య హాట్ స్టిల్స్ తెగ వదులుతుంది. ఈషా రెబ్బ హాట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతున్నాయి గాని, ముంబాయ్ గ్లామర్ బ్యూటీల హాట్ లుక్స్ ముందు తేలిపోతున్నాయి. అందుకే గ్లామర్ డోస్ రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది ఇషా.

కాగా తన గ్లామర్ తోనే కాకుండా తన లేటెస్ట్ మూవీ అప్ డేట్ తో కూడా ఇషా తాజాగా వార్తల్లోకి వచ్చింది. ఓ సప్సెన్స్ హర్రర్ థ్రిల్లర్ లో ఇషా నటించనుంది. ఈ చిత్రంలో సుశాంత్ హీరోగా నటించనున్నట్లు.. ఈ చిత్రాన్ని వెంకట్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించబోతునట్లు తెలుస్తోంది. ఇక 'అంతకు ముందు ఆ తరువాత' సినిమా ద్వారా తెలుగు వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైన, ఈ అచ్చ తెలుగు బ్యూటీ ఆ తర్వాత 'అమీతుమీ', 'అ', అరవింద సమేత లాంటి సినిమాల్లో తన యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి ఇప్పుడు తనే ప్రధాన పాత్రలో రాబోతున్న హర్రర్ థ్రిల్లర్ తో కూడా హిట్ అందుకుని స్టార్ డమ్ సంపాధిస్తుందేమో చూడాలి. కాగా త్వరలోనే ఈ సినిమా షూట్ కి వెళ్లనుంది. అన్నట్లు ఇషా ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా కూడా నటిస్తోంది.

Next Story
Share it