రాయ్‌లక్ష్మి 'సిండ్రెల్లా' టీజర్ విడుదల
By అంజి Published on 2 Dec 2019 9:25 AM IST
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న గ్లామర్ డాల్ 'రాయ్‌లక్ష్మి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'సిండ్రెల్లా'. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని మల్టీ కలర్ ఫ్రేమ్స్, ఎస్.ఎస్.ఐ ప్రొడక్షన్ బ్యానర్స్‌పై తెలుగులో మంచాల రవికిరణ్ 'సిండ్రెల్లా' పేరుతోనే ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎం.ఎన్.రాజు ఈ చిత్రానికి సహ నిర్మాత.
ఎస్.జె.సూర్య దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన విను వెంకటేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. హారర్ ఫాంటసీ, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సర్కార్ 3, కిల్లింగ్ వీరప్పన్ చిత్రాలకు కెమెరామెన్‌గా వర్క్ చేసిన రమ్మీ ఈ సినిమా సినిమాటోగ్రఫీ అందించారు.
కాంచన 2 చిత్రానికి సంగీతాన్ని అందించిన అశ్వామిత్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే గేమ్ ఓవర్ చిత్రానికి సౌండ్ డిజైన్ చేసిన సచిన్ ఈ చిత్రానికి చేసిన సౌండ్ డిజైనింగ్ హైలైట్ కానుంది. త్వరలోనే ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత మంచాల రవికిరణ్, సహ నిర్మాత ఎం.ఎన్.రాజు తెలిపారు.