'రాగ‌ల 24 గంట‌ల్లో'.. స‌క్సెస్ మీట్‌లో 'భార్య‌దేవోభ‌వ' సినిమా

By Newsmeter.Network  Published on  24 Nov 2019 11:48 AM GMT
రాగ‌ల 24 గంట‌ల్లో.. స‌క్సెస్ మీట్‌లో భార్య‌దేవోభ‌వ సినిమా

సత్యదేవ్‌, ఈషారెబ్బా, శ్రీరాం, గణేష్‌ వెంకట్రామన్‌, ముస్కాన్‌ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఈ చిత్రాన్ని ఢ‌మ‌రుకం ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి తెర‌కెక్కించారు. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవహాస్‌ క్రియేషన్స్‌ బానర్‌ పై శ్రీనివాస్ కానూరి ఈ సినిమాని నిర్మించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్ ఇటీవ‌ల రిలీజైంది. రోజురోజుకు పెరుగుతోన్న ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌సాద్ ల్యాబ్స్ లో 'రాగ‌ల 24 గంట‌ల్లో' స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.

డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ.... ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో త‌ర్వాత కొంత నిరాశ‌కులోన‌య్యాం. శ‌నివారం మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు హౌస్ ఫుల్ అవ్వ‌డం.. అన్ని చోట్లా క‌లెక్ష‌న్స్ బాగుండ‌డంతో చాలా హ్యాపీగా ఫీల‌య్యాం. ఈ సినిమా చూసిన వాళ్లు బాగుంది చూడండి అని ఓ ప‌ది మందికి చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా చూసిన వాళ్లు స‌త్య‌, ఈషా న‌ట‌న గురించి ప్ర‌త్యేకించి మాట్లాడుతున్నారు. స‌త్య సినిమా ఇండ‌స్ట్రీకి ఓ వ‌రం. ఫ్యూచ‌ర్ లో మ‌రిన్ని మంచి పాత్ర‌లు అత‌నికి వ‌స్తాయి. ఈషా అందంతో పాటు అభిన‌యంతో పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించి ఆక‌ట్టుకుంది. నేను ఏదైతే న‌మ్మి ఈ సినిమా తీసానో అది నిజం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఈ సినిమాకి రియ‌ల్ హీరో మా ప్రొడ్యూస‌రే. ద‌మ్మున్న నిర్మాత‌. క్వాలీటీ విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఈ మూవీని నిర్మించారు. 300 స్క్రీన్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేసాం. పెద్ద సినిమాకి ఎలాగైతే ప‌బ్లిసిటీ చేస్తారో అలా చేసాం. బుధ‌వారం నుంచి స‌క్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. వైజాగ్ నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ టూర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పాటు తెలంగాణ‌లో ఈ సినిమా ప్ర‌ద‌ర్శిస్తున్న అన్ని థియేట‌ర్స్ కి వెళ్లి ప్రేక్ష‌కుల‌ను క‌లుస్తాం. ర‌ఘు మ్యూజిక్, అంజి కెమారావ‌ర్క్ ఈ సినిమాకి ప్రాణం పోసాయి. కృష్ణ‌భ‌గ‌వాన్ డైలాగ్స్ సినిమా విజ‌యానికి హెల్ప్ అయ్యాయి. ఓ మంచి సినిమా తీసాన‌నే తృప్తి క‌లిగించింది.

ఇక త‌దుప‌రి చిత్రం గురించి చెప్పాలంటే... ఇదే బ్యాన‌ర్ లో అతి త్వ‌ర‌లో మ‌రో సినిమా చేయ‌బోతున్నాను. ఆ సినిమా టైటిల్ భార్య‌దేవోభ‌వ‌. ఇందులో ప్ర‌ముఖ హీరో న‌టించనున్నారు. ప‌ది మంది హీరోయిన్స్ న‌టించ‌నున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్ టైన్మెంట్ గా ఉంటుంది. మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్య‌దేవోభ‌వ వ‌లే.. భార్య గొప్ప‌త‌నం తెలియ‌చేసేలా 'భార్య‌దేవోభ‌వ' ఉంటుంది. పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలియ‌చేస్తాను అన్నారు.

Next Story
Share it