మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ – యంగ్ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న చిత్రం ప్ర‌తిరోజు పండ‌గే. సాయితేజ్ స‌ర‌స‌న రాశీఖ‌న్నా న‌టిస్తుంది. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతోన్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రైలర్ ను డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమాలో రావు రమేష్‌, మురళీ శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా రూపొందిన ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చుతుంద‌ని ద‌ర్శ‌కుడు మారుతి గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.