నాగార్జున కొత్త సినిమా గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

By అంజి  Published on  27 Nov 2019 3:45 AM GMT
నాగార్జున కొత్త సినిమా గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ 3 సీజన్‌కి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ షో పూర్త‌వ్వ‌డంతో అభిమానులు ఎప్పుడెప్పుడు నాగార్జున కొత్త సినిమాని ప్ర‌క‌టిస్తారా..? ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. అయితే...మ‌న్మ‌థుడు 2 సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో ఈసారి ఎలాగైనే స‌రే హిట్ మూవీ చేయాల‌నే ఉద్దేశ్యంతో విభిన్న క‌థా చిత్రాన్ని ఎంచుకున్నాడట నాగ్.

నాగ్ చేయ‌బోయే సినిమాకి ర‌చ‌యిత సోల‌మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఊపిరి, మ‌హ‌ర్షి చిత్రాల‌కు స్క్రీన్ ప్లే రైట‌ర్ గా వ‌ర్క్ చేసిన సోల‌మ‌న్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఆయ‌నకే ఇచ్చార‌ట నాగ్. ఇది కాన్సెప్ట్ బేస్డ్ డ్రామా. ఇందులో నాగార్జున పోలీసాఫీస‌ర్ గా న‌టించ‌నున్నారు. పోలీస్‌గా న‌టించ‌డం నాగార్జున‌కు కొత్తేమీ కాదు.

ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏంటంటే... ఇందులో నాగార్జున గంట సేపు మాత్ర‌మే క‌నిపిస్తార‌ట‌. భారీ తారాగ‌ణంతో రూపొందే ఈ సినిమా ఆడియ‌న్స్ కి ఖ‌చ్చితంగా న‌చ్చుతుంద‌ని నాగార్జున చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడ‌ట‌. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ను 2020 జనవరిలో ప్రారంభించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడక్షన్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం.

Next Story
Share it