మ‌హేష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!

By అంజి  Published on  30 Nov 2019 3:32 AM GMT
మ‌హేష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ మూవీ 'స‌రిలేరు నీకెవ్వ‌రు'. ఈ చిత్రాన్ని సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ రావ‌డంతో సినిమా స‌క్స‌స్ పై టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... డిసెంబ‌ర్ లో ఐదు సోమ‌వారాలు ఐదు పాట‌లు రిలీజ్ చేయ‌నున్నాయి.

ఇక ట్రైల‌ర్ ను జ‌న‌వ‌రి 1న రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రిలీజ్ కి వారం రోజులు ముందుగా అంటే.. జ‌న‌వ‌రి 5న ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. మిగిలిన సాంగ్ ను విదేశాల్లో చిత్రీక‌రించ‌నున్నారు. డిసెంబ‌ర్ 20కి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయ‌నున్నారు.

ఇదంతా చూస్తుంటే... ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌మోష‌న్స్ లో వెన‌క‌బ‌డ్డాడు అనిపించినా డిసెంబ‌ర్ నుంచి ప‌క్కా ప్లాన్ తో దూసుకెళ్ల‌డానికి రెడీ అవుతున్నాడు మ‌హేష్ బాబు. అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి.. బాక్సాఫీస్ వ‌ద్ద మ‌హేష్ ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తాడో చూడాలి.

Next Story
Share it