నాగ్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

By అంజి  Published on  21 Dec 2019 3:45 AM GMT
నాగ్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ 3 సీజ‌న్ కంప్లీట్ అయిన త‌ర్వాత కొత్త సినిమా స్టార్ట్ చేస్తాన‌న్నారు. బిగ్ బాస్ 3 కంప్లీట్ అయి చాలా రోజులు అవుతున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు నాగ్ నెక్ట్స్ మూవీని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌లేదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తార‌ని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అభిమానులు. తాజా వార్త ఏంటంటే... నాగ్ ఈ నెల 16న కొత్త సినిమాను సైలెంట్ గా స్టార్ట్ చేసేసారు.

ఊపిరి, మ‌హ‌ర్షి చిత్రాల‌కు రైట‌ర్ గా వ‌ర్క్ చేసిన సోల్మాన్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున కొత్త‌ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ నెల 16 నుంచి చార్మినార్ ద‌గ్గ‌ర షూటింగ్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఇందులో నాగార్జున ప‌వ‌ర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా న‌టిస్తున్నార‌ట‌. నాగ్ చేసే యాక్ష‌న్ సీన్స్ ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ క‌లిగించేలా ఉంటాయ‌ట‌.

దీని కోసం హాలీవుడ్ నుంచి టెక్నీషియన్లు వచ్చారని, ప్రస్తుతం వాళ్ల నుంచి నాగార్జున ట్రైనింగ్ తీసుకుంటున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అరవై ఏళ్ల వయసులో నాగార్జున సాహసాలు చేయబోతున్నారన్న తెలిసిన‌ప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్ట్ పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ యాక్ష‌న్ మూవీకి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. త్వర‌లోనే అఫిషియ‌ల్ గా ఈ మూవీని ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి.. మ‌న్మ‌థుడు 2 సినిమాతో మెప్పించ‌లేక‌పోయిన నాగ్... ఈ యాక్ష‌న్ డ్రామాతో అయినా విజ‌యాన్ని సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

Next Story