ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ఇందులో రాజ్ త‌రుణ్ – షాలిని పాండే జంట‌గా న‌టించారు. జీ.ఆర్. కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న క‌థా చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందిన ఈ చిత్రం క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న విడుదల కానుంది.

ఈ చిత్రం గురించి దిల్ రాజు ఓ కొత్త విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు. అది ఏంటంటే.. ద‌ర్శ‌కుడు జీ.ఆర్.కృష్ణ ఓ ట‌ర్కీ సినిమా చూసాడ‌ట‌. అందులోని ఐడియా న‌చ్చి దిల్ రాజుకి చెప్పాడ‌ట‌. అక్కడ నుండి మన నెటివిటీకి తగిన విధంగా కథను డెవలప్‌ చేశాం. ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ.

చిన్నప్పట్నుంచి హీరో, హీరోయిన్‌ మధ్య ఇంటిమెసీ ఎలా ఉంటుంది? ఇద్దరూ అనుకోకుండా విడిపోయి.. ఎలా కలిశారు? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అనేది కథ. ఈ సినిమా కథ తెలుసుకున్న రాజ్‌తరుణ్‌ నన్ను వచ్చి కలిసి ‘సార్‌! కథ బావుందని విన్నాను. నేను చేస్తానండి’ అన్నాడు. అలా సినిమా మొదలైందని..ఈ సినిమాకి ట‌ర్కీ సినిమా ఇన్ స్పిరేష‌న్ అని చెప్పారు. అలాగే… ఖ‌చ్చితంగా డిసెంబర్‌ 25 వచ్చే ‘ఇద్దరి లోకం ఒకటే’ అందరికీ నచ్చుతుంది” అన్నారు. మ‌రి.. దిల్ రాజు న‌మ్మ‌కం ఎంత వ‌ర‌కు నిజ‌మౌతుందో చూడాలి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.