స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’.. ఈ చిత్రంలోని మరో పాట 24-12-19 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు యూట్యూబ్ ద్వారా విడుదల అయింది. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతాన్ని యువ గాయకుడు అర్మాన్ మాలిక్ అద్భుతంగా ఆలపించారు.

సంగీత దర్శకుడు తమన్ తన వీనుల విందైన బాణీలతో మరోసారి సంచలనం సృష్టించారు. బుట్ట బొమ్మ గీతం బుట్ట బొమ్మా..బుట్ట బొమ్మా నన్ను సుట్టూ కుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టూ కుంటివే అంటూ సాగే ఈ గీతం టీజర్ ఇటీవల విడుదలై పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసేలా చేసింది. ఇప్పుడు విడుదల అయిన ఈ పూర్తి బుట్ట బొమ్మ గీతం అటు సంగీత ప్రియుల్ని, ఇటు ప్రేక్షకాభిమానులను విపరీతంగా అలరిస్తూ, ఈ చిత్రం నుంచి విడుదలైన గీతాల రికార్డ్ ల సరసన చేరే దిశగా దూసుకెళుతుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదల అవుతోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.