ఈ సారి 'సంక్రాంతి' హీరో ఎవరో ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Dec 2019 10:27 AM GMT
ఈ సారి సంక్రాంతి హీరో ఎవరో ?

సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల హడావిడి ప్రతి ఏడాది ఉండేదే. కాకపోతే ఈ సారి రిలీజ్ అయ్యే చిత్రాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ ఆసక్తికి ప్రధాన కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒక రోజు గ్యాప్ లో బాక్సాఫీస్ పోరుకు దిగడమే. తెలుగు ఇండస్ట్రీలో అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న, స్టైలిష్ స్టార్ బన్నీ సినిమా 'అల వైకుంఠపురంలో' జనవరి 12న రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయి ..? ఓవరాల్ గా ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి ? అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల సందేహాల సమూహంశాలను వెదజల్లుతున్నారు.

అయితే మధ్యలో రజినీకాంత్ 'దర్బార్' డబ్బింగ్ సినిమా కూడా విడుదల అవుతుంది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ రజినీకాంత్ కి ఉన్న స్టార్ డమ్ రీత్యా, ఆయన కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలకు గట్టిపోటీనే ఇస్తారు. ఆ పోటీకి తగ్గట్లు రజిని సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే.. రజిని సినిమా కలెక్షన్ల ఎలా ఉంటాయో తెలిసిందే. అయినా బయ్యర్స్ మాత్రం మహేష్ సినిమా పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. సరిలేరు నీకెవ్వరు యాక్షన్ ఎంటర్టైనర్ ఐనప్పటికీ కామెడీ పాళ్ళు ఎక్కువ ఉంటాయని.. ముఖ్యంగా సినిమా అంతా మంచి కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయని, అలాగే హీరోహీరోయిన్ల మధ్య నడిచే ట్రైన్ ఎపిసోడ్ లో కూడా హిలేరియస్ కామెడీ ఉంటుందని.. అందుకే ఈ సినిమాకే ఎక్కువ ఆదరణ ఉంటుందని బయ్యర్లు చెప్పుకొస్తున్నారు. ఆ కారణాల కారణంగా ఈ సినిమాకి ఎక్కువ రేట్లు ఇచ్చి మరి కొన్నారు.

కానీ మాటల మాంత్రికుడు పంచ్ ల కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తెరకెక్కిస్తున్న అల వైకుంఠపురంలో కూడా త్రివిక్రమ్ మార్కు కామెడీ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మెయిన్ గా పూజాతో ఆఫీస్ ఎపిసోడ్స్ మరియు బన్నీ మురళి శర్మల మధ్య మంచి కామెడీ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని ఫిల్మ్ నగర్ టాక్. అది నిజమే అయితే మహేష్ సినిమా కంటే కూడా ఈ సినిమాకే ఫ్యామిలీ ప్రేక్షకులు మొగ్గు చూపుతారు. ఏమైనా ఎక్కువ కామెడీని పండించి ప్రేక్షకులను బాగా నవ్వించిన మూవీనే సంక్రాంతి హిట్ గా నిలిచే అవకాశం ఉంది. మరి 'సంక్రాంతి' హీరోగా ఎవరు నిలబడతారో చూడాలి.

Next Story
Share it