ప్చ్.. 'మహేష్'ను ఇబ్బంది పెడుతోన్న 'బన్నీ' !

By Newsmeter.Network  Published on  31 Dec 2019 10:29 AM GMT
ప్చ్..  మహేష్ను ఇబ్బంది పెడుతోన్న బన్నీ !

మొత్తానికి 'అల్లు అర్జున్', మహేష్ బాబును బాగానే ఇబ్బంది పెడుతున్నాడు. మొదట 'సరిలేరు నీకెవ్వరు' సినిమాని జనవరి 12న విడుదల చేస్తున్నాం అని మహేష్ టీమ్ ప్రకటించగానే, బన్నీ టీమ్ కూడా అదే రోజున 'అల వైకుంఠపురములో' సినిమా రిలీజ్ డేట్ ను కూడా జనవరి 12నే అని ఎనౌన్స్ చేసింది. దీంతో ఈ పోటీతో ఓపెనింగ్స్ దెబ్బ తింటాయని బయ్యర్లు తెగ కంగారుపడిపోయారు. రిలీజ్ డేట్స్ ప్రకటించి పోటీకి తెర తీసిన హీరోలు, ఆ తరువాత తమ సినిమా విడుదల తేదీని మార్చుకున్నారు. జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు'ను, అలాగే జనవరి 12న 'అల వైకుంఠపురములో' ను విడుదల చేయాలని ఫిక్స్ చేసుకున్నారు. ఆ డేట్స్ ప్రకారమే థియేటర్స్ ను పంచుకున్నారు,

కానీ ఇప్పుడు సీన్ మారింది. బన్నీ ఇప్పుడు తన సినిమాని జనవరి 10న రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంతో థియేటర్స్ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. మంచి మంచి ఏరియాల్లోని థియేటర్స్ ను బన్నీ సినిమాకే వెళ్తాయి. తరువాత వచ్చే మహేష్ సినిమాకి థియేటర్స్ సమస్య రానుంది. మరి ఇప్పుడు మహేష్ ఏం చేస్తాడో. ఇంతకీ బన్నీ పోటీ పడటానికి ప్రధాన కారణం సినిమా అవుట్ ఫుట్ పై నమ్మకమేనట.

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా మ్యూజిక్ తోనే యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాకి తమన్ ఇచ్చిన ట్యూన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా సెట్ అయ్యాయట. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్ లో ఎమోషనల్ సన్నివేశాలు ఆలాగే బన్నీ స్క్రీన్ ప్రేజన్సీ అద్భుతంగా ఉంటాయట. అందుకే బన్నీ ఈ సినిమా విషయంలో ఎక్కడా తగ్గట్లేదని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో టాల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే యంగ్ హీరో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా ముఖ్యమైనపాత్రలో కనిపించనుంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Next Story