'జాన్'లో ప్రభాస్ లుక్స్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

By Newsmeter.Network  Published on  29 Dec 2019 11:03 AM GMT
జాన్లో  ప్రభాస్ లుక్స్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

మొత్తానికి 'సాహో' బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవ్వడంతో ప్రభాస్ 'జాన్' పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడట. ప్రభాస్ ఒక లుక్ లో అత్యంత ధనికుడిగా ఈ సినిమాలో కనిపించనున్నాడని.. అదేవిధంగా ఒక పేదింటి అమ్మాయి (సెకెండ్ హీరోయిన్)తో ప్రేమలో పడినప్పుడు, ఆమె ప్రేమ కోసం ఏమి లేని వాడిగా ఆమె చుట్టూ తిరుగుతాడట. ఈ ప్రేమ సన్నివేశాల్లో ప్రభాస్ మరో లుక్ లో కనిపిస్తాడట. కాగా రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ లవ్ స్టోరీనే ఈ సినిమా అని ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తుంది. పైగా 1960 కాలంలో ఈ సినిమా సాగుతుందట. ఇక రీసెంట్ గా ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారు. భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో వచ్చిన 'సాహో' బలమైన ఓపెనింగ్స్ ను కంటిన్యూ చేయకపోవడంతో ప్రభాస్ బాగా ఫీల్ అయ్యాడు.

మెయిన్ గా సాహో ప్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం సినిమా ప్లే గందరగోళంగా మరియు సీరియస్ గా సాగడమే అని.. అందుకే ప్రభాస్ జాన్ లో బాగా ఎంటర్టైన్ మెంట్ ఉండేలా ప్రత్యేకంగా ఓ కామెడీ ట్రాక్ ను పెట్టేలా చూసుకున్నాడట. కామెడీ బాగా రాస్తాడు అని పేరు ఉన్న గోపిమోహన్, కామెడీ రైటర్ ఆకుల శివ స్క్రిప్ట్ లో కొన్ని కామెడీ సీన్స్ మళ్లీ రాశారట. ఇప్పటికే దర్శకుడు కూడా ఆ సీన్స్ పై వర్క్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. అలాగే పరుచూరి బ్రదర్స్ కూడా స్క్రిప్ట్ లో మార్పులు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నారని.. ప్రభాసే పరుచూరి బ్రదర్స్ ను ప్రత్యేకంగా స్క్రిప్ట్ ను చూడమని చెప్పాడు.

కాగా 'జిల్' సినిమాని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివ‌ర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Next Story