ఇవైనా.. హిట్ ట్రాక్ ఎక్కిస్తాయా ?
By Newsmeter.Network Published on 28 Dec 2019 1:55 PM GMTఇష్క్ మూవీకు ముందు వరకూ ఇండస్ట్రీ లో హీరో నితిన్ పరిస్ధితి ప్లాప్ కి సింబాలిజమ్ అనే స్థితిలో వుండేది. ఎట్టకేలకూ 'ఇష్క్' తరువాత 'గుండెజారి గల్లంతయ్యిందే' 'అ ఆ' సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని మళ్ళీ ఘనంగా హిట్ ట్రాక్ ఎక్కాడు నితిన్. కానీ గత మూడు సినిమాలు 'లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం' ఇలా వరుస ప్లాప్ లతో మళ్లీ ప్లాప్ ల పరంపరలో మునిగిపోయాడు. అందుకే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఎంతో ప్లాన్ గా స్క్రిప్ట్ ను దగ్గరుండి రెడీ చేయించుకోని మరీ 'భీష్మ' మూవీని తీసుకురాబోతున్నాడు. 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఆంథమ్ సాంగ్ కూడా భాగానే ఆకట్టుకుంది. 24 గంటల్లో 1.8 మిలియన్ల డిజిటల వ్యూస్ ని సాధించింది.
ఇక ఈ చిత్రంలో కామెడీ చాల బాగా వస్తోందని.. మెయిన్ గా వెన్నల కిశోర్ ట్రాక్ మొత్తం సినిమాలోనే హైలైట్ అవుతుందని... మొత్తానికి వెంకీ కుడుముల 'ఛలో' మాదిరిగానే ఈ సినిమాని కూడా ఫుల్ ఎంటెర్టైనింగా మలుస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన రోల్ కోసం యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా హెబ్బా పటేల్ పాత్ర బాగా బోల్డ్ గా ఉంటుందట. హెబ్బా గ్లామర్ కూడా సినిమాలో హైలెట్ నిలుస్తోందట. నితిన్ అయితే భీష్మ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు.
కాగా ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా రష్మిక మండన్నా నటిస్తోంది. అన్నట్లు నితిన్, 'భీష్మ'తో పాటు వెంకీ అట్లూరి దర్శకుడిగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలోనూ అలాగే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. మరి కనీసం ఈ సినిమాలైనా నితిన్ ను హిట్ ట్రాక్ ఎక్కిస్తాయేమో చూడాలి.