అయ్యో.. దిల్ రాజు జడ్జిమెంట్ కి ఏమైంది ?

By Newsmeter.Network  Published on  5 Dec 2019 10:44 AM GMT
అయ్యో.. దిల్ రాజు జడ్జిమెంట్ కి ఏమైంది ?

ఈ తరం సినీ నిర్మాణానికి టాలీవుడ్ లో విలువైన గౌరవం తెచ్చిన వ్యక్తి నిస్సందేహంగా దిల్ రాజే అని అంగీకరించాల్సిందే. దిల్ రాజు అఫీసే ఓ చిన్న సినీ పరిశ్రమ అన్నట్లుగా గుర్తింపు పొందింది. దానికి కారణం దిల్ రాజు జడ్జిమెంటే. మంచి కథలను ఎంచుకోవడంలో కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో దిల్ రాజు ప్రతిభ అపారమైనది. కానీ దిల్ రాజుకి ఈ మధ్య ఏమైంది ? ఒకప్పుడు దిల్ రాజు, వేరే సినిమాని తీసుకున్నాడు అంటే, ఇక ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ హిటే అని ఒక నమ్మకం ఉండేది. దానికి తగ్గట్లుగానే గతంలో 'తెలుగు సినిమా బాక్సాఫీస్' వరుస ప్లాప్ లతో రెవిన్యూ పరంగా కొట్టు మిట్టాడుతున్న సమయంలో కూడా.. దిల్ రాజు ఓ భారీ విజయంతో మొత్తం ఇండస్ట్రీకే ఊపు తేచ్చేవాడు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది, ఈ మధ్య దిల్ రాజు జడ్జిమెంట్ గాడి తప్పిందా అనిపిస్తోంది.

గత సంవత్సరం చేసిన 'లవర్, శ్రీనివాసకళ్యాణం' లాంటి చిత్రాలే అనుకుంటే.. రీసెంట్ గా ఎవ్వరికీ చెప్పొద్దు, అనే ఓ విషయం లేని సినిమాని దిల్ రాజు సమర్పించాడు. ఆ సినిమా దిల్ రాజు స్థాయి సినిమా కానేకాదు. అంతలోనే మళ్ళీ.. ఇటీవలే రిలీజ్ అయి భారీ ప్లాప్ గా నిలిచిన 'ఆవిరి' చిత్రాన్ని కూడా దిల్ రాజే ప్రేక్షకులకు అందించాడు. 'ఎవ్వరికీ చెప్పొద్దు' దెబ్బకే దిల్ రాజు పేరు డామేజ్ అయిందనుకుంటే.. 'ఆవిరి' సినిమా దెబ్బతో దిల్ రాజు జడ్జిమెంట్ పై పూర్తిగా అనుమానం వచ్చేలా చేసింది. కాగా ఇలాంటి మరో విషయం లేని సినిమానే 'చూసి చూడంగానే'. ఈ సినిమాని కూడా దిల్ రాజునే రిలీజ్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇకనైనా దిల్ రాజు, విషయం లేని సినిమాలు పక్కన పెడితే ఆయనకే మంచిది.

Next Story