టాలీవుడ్ డార్లింగ్ ‘ప్ర‌భాస్’ స్పెష‌ల్ స్టోరీ : పార్ట్ –3

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 6:14 AM GMT
టాలీవుడ్ డార్లింగ్ ‘ప్ర‌భాస్’ స్పెష‌ల్ స్టోరీ : పార్ట్ –3

భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూళ్ళు సాధించిన బాహుబలి చిత్రంలో నటించిన ప్రఖ్యాత భారతీయ నటుడు ప్రభాస్‌ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్‌లో మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించారు. ప్రభాస్‌ ప్రతిమను యదాతధంగా రూపొందించడానికి మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియం నుంచి వచ్చిన కళాకారులు ప్రభాస్‌ను కలిసి హైదరాబాద్‌లో కలిసి 350 ఫొటోలను, ఆయన శారీరక కొలతలను తీసుకుని, బాహుబలి చిత్రంలోని వస్త్రధారణతో ఉన్న ఆహార్యాన్ని పోలిన ప్రతిమను సృష్టించి అదే పేరుతో మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో ప్రతిష్టించారు. ప్రపంచ స్ధాయి కళాకారుల సరసన చోటు సంపాదించిన ఈ మైనపు ప్రతిమ మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో మార్చ్‌ 2017 నుంచి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది.

Prabahs3

2016 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మైనపు విగ్రహ ప్రతిష్ట తర్వాత, ఈ గౌరవం దక్కించుకున్న మూడవ భారతీయునిగా ప్రభాస్‌ నిలిచారు. ఇప్పుడు ప్రభాస్‌ జాతీయ స్థాయి నటుడిగా ఎదగడంతో పాటు, అనేక మంది అభిమానుల్ని, ప్రశంసల్ని సంపాదించారు. బాహుబలితో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్‌తో యువి క్రియేషన్స్‌ సుజీత్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో 150 కోట్ల భారీ బడ్జెట్‌తో 'సాహో' చిత్రాన్ని హైటెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మించింది. (ఇంకా ఉంది..)

Prabhas Bdy

Next Story
Share it