టాలీవుడ్ డార్లింగ్ ‘ప్ర‌భాస్’ స్పెష‌ల్ స్టోరీ : పార్ట్ - 2

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 7:27 AM GMT
టాలీవుడ్ డార్లింగ్ ‘ప్ర‌భాస్’ స్పెష‌ల్ స్టోరీ : పార్ట్ - 2

ఇతర దేశాల్లో కలెక్షన్స్‌ అంతా చూస్తే బహుబలి రెండో పార్ట్‌ మాత్రమే రూ.1700 కోట్లను రాబట్టుకుంది. బాహుబలి మొదటి భాగం రూ.700 కోట్లను వసూలు చేసింది. దీంతో ప్రపంచ సినిమాయే తెలుగు సినిమాకు ఇంత పెద్ద మార్కెట్‌ ఉందా? అసలు బాహుబలి సినిమా ఏంటి? ఎవరీ ప్రభాస్‌? అని అందరూ మాట్లాడుకునేలా చేసిన బాక్సాఫీస్‌ బాహుబలి మన యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌.

Prabhas

బాహుబలి సినిమాకు ముందు తర్వాత అనే రేంజ్‌లో తెలుగు సినిమా స్థాయి, మార్కెట్‌ పెరిగింది. అంతర్జాతీయంగా చైనా సహా పలు దేశాల్లో ఈ చిత్రం విజయం సాధించింది. బాహుబలి వరకు ప్రభాస్‌ తెలుగు హీరో. బాహుబలి-2 తర్వాత ఇంటర్నేషల్‌ హీరో అయ్యారు. రాజమౌళి టేకింగ్‌, ప్రభాస్‌ యాక్టింగ్‌ కలవడంతో సినిమా సెన్సేషన్స్‌కు కొదవలేకుండా పోయింది. పలు దేశాల్లో ఈ చిత్రం ప్రదర్శించడం ద్వారా ప్రభాస్‌ ఇంటర్నేషనల్‌ హీరో అయ్యారు.

Prabahs3

బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. యూనివర్సల్‌ హీరోగా ప్రభాస్‌ ఎంతో ఖ్యాతిని సంపాదించుకున్నారు‌. ఒకప్పుడు బాలీవుడ్‌లో తెలుగు సినిమా అంటే చిన్నచూపు చూసేవారు. కానీ ఇప్పుడు ప్రభాస్‌ నటనకు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రభాస్‌ను హిందీలో నటించమని ఆఫర్స్‌ ప్రకటించడం అతనికి వున్న ఫాలోయింగ్‌ని తెలియజేస్తుంది. (ఇంకా ఉంది..)

Next Story
Share it