భారత్‌ మరోసారి విలువిద్య క్రీడల్లో దూసుకుపోయింది. ఈ సారి విలువిద్య క్రీడాకారిని దీపిక కుమారి తన సత్తా చాటింది. అయితే దీపికా.. ఆసియా విలువిద్య ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణం గెలవడమే కాక.. టోక్యో ఒలింపిక్స్‌ బెర్తూ సంపాదించింది. మహిళల రికర్వ్‌ విభాగంలో 7-2తో మలేషియాకు చెందిన నూర్‌ ఆసిఫాను, ఆ తర్వాత 6-2తో ఇరాన్‌కు చెందిన జహ్రాను ఓడించింది. దీంతో దీపిక ఫైనల్‌కు చేరి ఒలిపింక్‌లో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత వియత్నాంకు చందిన గుయెత్‌ను, మన దేశానికి చెందిన అంకిత బకత్‌ను 6-2తో ఓడించి స్వర్ణం గెలిచింది. దీంతో అంకిత రన్నరప్‌గా మిగిలి రజతం సాధించింది. అయితే ఇప్పటికే పురుషుల రికర్వ్‌లో తరుణ్‌దీప్‌- అతాను ఇప్పటికే చోటు సంపాధించిన సంగతి తెలిసిందే.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.