నూర్‌ సుల్తాన్ (కజకిస్తాన్‌): భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు శుభవార్త. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ఆమె అర్హత సాధించారు. అమెరికా క్రీడాకారిణి సరా హిల్టర్‌ బ్రాండ్జ్‌ను ఓడించడం ద్వారా ఫొగాట్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 53 కేజీల విభాగంలో ఫొగాట్ ఒలింపిక్స్‌లో తలపడనుంది. 8-2 తేడాతో సరాను ఫొగాట్ ఘోరంగా ఓడించారు . గ్రీస్‌కు చెందిన టాప్‌ రెజ్లర్‌ మరియా ప్రెవోలరాకితో ఆమె తలపడనుంది. మరియాపై గెలుపొందితే ఫొగాట్ కాంస్య పతకం సొంతం గెలుచుకుంటారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.