• ఢిల్లీలో సీఎం జగన్ రెండ్రోజులపాటు పర్యటన
  • హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ

అమరావతి: ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రెండ్రోజులపాటు పర్యటన కొనసాగుతుందని చెప్పారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌ పోర్ట్ నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్తారు వైఎస్ జగన్. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకుని..కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహా పలువురు నేతలతో భేటీ అవుతారు. 22వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయల్దేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ గొట్టేటి మాధవి వివాహ రిసెప్షన్‌కు హాజరై..రాత్రి 9 గంటలకు నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story