టెన్షన్.. టెన్షన్.. తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు
By సుభాష్ Published on 4 Jun 2020 4:38 PM GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. కేసుల నమోదు చూస్తుంటే గుండెల్ల దడపుట్టుకొస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 127 కేసులు నమోదైనట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో తెలిపింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3147 కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా ఆరుగురు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 105కు చేరింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 1587మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 1455మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 110 కేసులుండటం గమనార్హం.
గతంలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇటీవల నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే ముందు ఇతర జిల్లాల్లో కూడా కరోనా తీవ్రంగా ఉన్నా కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో తప్ప ఇతర జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అయితే గత నాలుగైదు రోజుల నుంచి మళ్లీ ఇతర జిల్లాల్లో కూడా కరోనా కేసులు నమోదు కావడంపై రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వాన్ని మరింత కలవరపెడుతోంది.