కొండెక్కిన బంగారం ధర

By సుభాష్  Published on  22 July 2020 3:28 PM IST
కొండెక్కిన బంగారం ధర

దేశంలో బంగారం ధర పరుగులు పెడుతోంది. తాజాగా ఆల్‌టైమ్‌ రికార్డుకు చేరుకుంది. భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 50వేలు దాటేసింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉండటంతో యూఎస్‌ - చైనా వాణిజ్య యుద్ధంతో అనిశ్చిత పరిస్థితులు నెలకొడనంతో బంగారంపై పెట్టుబడికి బాగా డిమాండ్‌ పెరిగింది.

ఇక హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100కి చేరుకుంది. ఇక అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850కి చేరుకుంది.

అలాగే బంగారం బాటలో వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి ధర ఏకంగా రూ.2250 పెరిగి, ప్రస్తుతం 58,950కు చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంచుకోవడమే బంగారం పెరగడానికి కారణమని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

అలాగే దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం పరుగులు పెడుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48వేలకు చేరుకోగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50వేలకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. ఔన్స్‌ కు 0.16శాతం పెరిగింది. దీంతో బంగారం ధర ఔన్స్‌ కు 1846 డాలర్లకు ఎగబాకింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా అదే దారిలో ఉంది. వెండి ధర ఔన్స్‌ కు 6.67 శాతం పెరుగుదలతో 22.99 డాలర్లకు చేరింది.

Next Story