దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. యంగ్ టైగర్ ఎన్టీర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అప్‌డేట్స్ కోసం ఇటు నందమూరి అభిమానులతో పాటు, అటు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ను బుధ‌వారం విడుద‌ల చేయ‌బోతున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను అన్ని భాషల్లోనూ లాంచ్ చేస్తున్నారు. తెలుగు పోస్టర్‌ను డీవీవీ మూవీస్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేస్తుండగా.. తమిళ్ పోస్టర్‌ను ఎన్టీఆర్ అఫీషియల్, హిందీ పోస్టర్‌ను అజయ్ దేవగణ్, కన్నడ పోస్టర్‌ను వారాహి, మలయాళ పోస్టర్‌ను రామ్ చరణ్ యూట్యూబ్ ఛానెళ్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

‘RRR టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నాం. ఫ‌లానా స‌మ‌యానికి విడుద‌ల చేస్తామ‌ని చెప్ప‌లేను. ఎందుకంటే.. మా బృందం వాళ్ల వాళ్ల ఇంటి నుంచి ప‌ని చేస్తున్నారు. మీ నివాసాల్లో జాగ్ర‌త్త‌గా ఉండండి. ఆన్‌లైన్‌లో ఉండండి.. థ్రిల్ అవ్వండి. పోస్ట‌ర్లు, ఫెక్సీలు ఏర్పాటు చేయెద్ద‌ని కోరుతున్నా’ అని రాజ‌మౌళి ట్వీట్ చేశారు. దీంతో పాటు ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను పంచుతున్నారు. అందులో నీరు, నిప్పు ఉన్న చేతుల్ని చూపించారు. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా న‌టిస్తున్నారు.

ఇక‌ ఈ సినిమా నుంచి ఆలియా భట్ తప్పుకున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆమె స్థానంలో మరొక తార కోసం రాజమౌళి వెతుకున్నారని కూడా అన్నారు. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని ఈరోజు తేలిపోయింది. ఎందుకంటే RRR మోషన్ పోస్టర్ విడుదల ప్రకటనను ఆలియా భట్ కూడా ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్‌ను RRR మూవీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ నుంచి రీట్వీట్ చేశారు. ఆలియా భట్ ఈ సినిమాలో చేస్తున్నారని ఇంతకంటే స్పష్టత ఏముంటుంది.


వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort