తిరుమల లడ్డూ కల్తీ కేసు ఘటనపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. SIT విచారణపై తమకు నమ్మకం లేకనే.. CBI విచారణను కోరామని గుర్తు చేశారు. CBI రిపోర్ట్ రాకముందే కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. కూటమి నేతల తప్పుడు ప్రచారంపై మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. తిరుమల లడ్డూలో జంతువుల కోవ్వు కలవలేదని CBI రిపోర్ట్ ఇచ్చిందన్నారు. తాము నిలిపివేసిన నాలుగు ట్యాంకర్లకు కూటమి ప్రభుత్వం అనుమతిచ్చిందని చెప్పారు. ఆ నెయ్యితో లడ్డూలు చేశారని, దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.