తిరుమలలో స్టీల్‌ హుండీల ఏర్పాటుకి టీటీడీ నిర్ణయం

టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఇకపై స్టీల్ హుండీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  30 July 2023 11:54 AM GMT
TTD, Steel Hundi, Tirumala ,

తిరుమలలో స్టీల్‌ హుండీల ఏర్పాటుకి టీటీడీ నిర్ణయం

టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఇకపై స్టీల్ హుండీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా స్టీల్‌ హుండీలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 29న తిరుమలలో 5 అడుగుల స్టీల్‌ హుండీని ప్రయోగాత్మంగా పెట్టి పరిశీలించారు అధికారులు. శనివారం ఐదు అడుగుల స్టీల్ హుండీని ఏర్పాటు చేశారు. కొద్దిరోజులు పరిశీలించిన తర్వాత బాగుంటే మరికొన్ని స్టీల్ హుండీలు ఏర్పాటు చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.

కాగా.. ప్రస్తుతం తిరుమల దేవస్థానంలో చాలా చోట్ల హుండీలు ఉన్నాయి. కానీ అవి భారీ గంగాళాలు. వాటిల్లోనే భక్తులు కానుకలు సమర్పిస్తారు. వీటి స్థానంలోనే హుండీలు ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది. అయితే.. ఇప్పుడున్న గంగాళంలో కొందరు దొంగలు కానుకలు వేస్తున్నట్లు నటిస్తూ లోనికి చేతులు పెట్టి దొంగతనాలు చేస్తున్న ఘటనలు వెలుగు చూశాయి. ఇలాంటి ఘటనలకు తావు ఇవ్వకుండా స్టీల్‌ హుండీలు ఏర్పాటు చేసేందుకు టీటీడీ నిర్ణయించింది. అయితే.. ఈ స్టీల్‌ హుండీలకు మూడు వైపులా కానుకలు వేసేందుకు వీలు ఉండనుంది. మధ్యలో ఇనపరాడ్డు ఉంటుంది.. దాంతో భక్తులు లోనికి చేయి పెట్టేందుకు వీలు ఉండదు. స్టీల్‌ హుండీలు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక ఇది భక్తులకు ఈజీగా ఉంటే త్వరలోనే అన్ని చోట్ల స్టీల్ హుండీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న హుండీలకు సంబంధించి సమస్యలు ఉన్నాయని టీటీడీ అంటోంది. కానుకల కోసం కొప్పెరలో భారీ గంగాళాలు వేసి అందులో ఇత్తడి హుండీలు ఏర్పాటుచేశారు. ఈ హుండీలను ట్రాలీలపై ఆలయం నుంచి బయటకు తీసుకెళ్లి లారీలో ఎక్కించి పరకామణికి తరలిస్తారు. ఈ క్రమంలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు అంటున్నారు. అందుకే స్టీల్‌ హుండీలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది టీటీడీ.

Next Story