శ్రీవారి భ‌క్తుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. శ్రీవాణి టికెట్ల పై టీటీడీ కీల‌క నిర్ణ‌యం

శ్రీవారి భక్తులకు గమనిక. శ్రీవాణి టికెట్ల విషయంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2023 11:35 AM IST
Srivani Tickets, Srivani Trust Darshan,Tirumala Srivani Tickets

శ్రీవాణి టికెట్ల పై టీటీడీ కీల‌క నిర్ణ‌యం

శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) శ్రీవాణి టికెట్ల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తిరుమ‌ల‌లోని గోకులం కార్యాల‌యంలో బుధ‌వారం నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్ల జారీని పునఃప్రారంభించింది. ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు రోజుకు 150 టికెట్లు ఇవ్వ‌నున్నారు.

మార్చి నెల నుంచి ప్ర‌తి రోజు 1000 శ్రీవాణి టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో 500 టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో, 400 టికెట్ల‌ను గోకులం అతిథిగృహంలో ఆఫ్‌లైన్‌లో, వంద టికెట్ల‌ను రేణిగుంట విమానాశ్ర‌యంలో క‌రెంట్ బుకింగ్ కింద జారీ చేస్తారు.

ఇత‌రుల కోసం టికెట్లు కొనే వీలు లేదు. టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆఫ్‌లైన్‌లో టికెట్లు పొందాలని టీటీడీ అధికారులు తెలిపారు. ద‌ళారుల నివార‌ణ‌కు ఇలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు.

మూడేళ్ల క్రితం ప్రారంభించిన వీఐపీ దర్శన వ్యవస్థకు మంచి స్పందన వచ్చింది. శ్రీవాణి ట్రస్ట్ టీటీడీలో ఒక భాగం. శ్రీవాణి టికెట్‌ ఉన్నవారు టీటీడీ ట్రస్టుకు విరాళం ఇవ్వవచ్చు. ప్రారంభించినప్పటి నుంచి ట్రస్ట్‌కు విరాళాల రూపంలో రూ.650 కోట్లు వచ్చాయి.

Next Story