శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ 9 రోజులు ప్రత్యేక దర్శనాలు రద్దు: టీటీడీ

TTD EO Dharmareddy meeting on tirumala brahmotsavam. తిరుమల శ్రీవారి బ్రహ్మత్సవాలు సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారికి

By అంజి  Published on  28 July 2022 11:15 AM GMT
శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ 9 రోజులు ప్రత్యేక దర్శనాలు రద్దు: టీటీడీ

తిరుమల శ్రీవారి బ్రహ్మత్సవాలు సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారికి నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవా ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో కేవలం సర్వదర్శన భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వీఐపీ బ్రేక్ దర్శనం కేవలం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకే వర్తిస్తుందని చెప్పారు.

సెప్టెంబర్‌ 27న ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుందని, అదే రోజు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్‌ జగన్‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అక్టోబర్‌ 1న గరుడ వాహనం, 5న చక్రస్నానం నిర్వహిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు శ్రీవారికి వాహన సేవలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తులు ఈ మార్పులను గమనించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

Next Story
Share it