తిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రిక్ బస్సు చోరీ
తిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రిక్ బస్సును ఎత్తుకెళ్లారు దుండగులు.
By Srikanth Gundamalla Published on 24 Sept 2023 12:39 PM ISTతిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రిక్ బస్సు చోరీ
తిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రిక్ బస్సును ఎత్తుకెళ్లారు దుండగులు. తిరుమలలో భక్తులను వివిధ ప్రాంతాలకు ఉచితంగా తరలిస్తుంది ఈ బస్సు. సెప్టెంబర్ 24న ఉదయం 4 గంటలకు ఈ బస్సు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన ఎలక్ట్రిక్ బస్సు ఖరీదు రూ.2కోట్లు ఉంటుందని చెప్తున్నారు.
చోరీకి గురైన వెంటనే పోలీసులు బస్సుని గుర్తించారు. జీపీఎస్ ఆధారంగా బస్సు కదలికలను పసిగట్టారు. తిరుమల నుంచి తిరుపతికి బస్సును తీసుకెళ్లిన నిందితులు.. అక్కడి నుంచి నుల్లూరుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉదయం గ్యారేజ్‌లో బస్సు కనిపించకపోవడంతో చోరీకి గురైందని అధికారులు భావించారు. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నాయుడుపేట పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బస్సు జీపీఎస్‌ను ట్రాక్ చేశారు. కాగా.. బస్సు చోరీ చేసిన తర్వాత నెల్లూరు వరకు వెళ్లాక బస్సులో చార్జింగ్ అయ్యిపోయింది. దాంతో.. నిందితులు బస్సును రోడ్డుపైనే వదిలేసి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. బస్సును రిటర్న్‌గా తిరుమలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని.. సీసీ కెమెరాలను పరిశీలిస్తామని వెల్లడించారు.
కాగా.. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్నారు మలయప్పస్వామి. మాఢవీధుల్లో భక్తులు శ్రీనివాసుడికి మంగళ హారతులు ఇస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు బంగారు గొడుగు ఉత్సవం... రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలో స్వామివారు దర్శమివ్వన్నారు.