తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త

తిరుమల తిరుపతి శ్రీవారి భక్తలకు ముఖ్య గమనిక.

By Srikanth Gundamalla  Published on  29 Oct 2023 1:15 AM GMT
ttd Diaries, available online, tirumala,

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త

తిరుమల తిరుపతి శ్రీవారి భక్తలకు ముఖ్య గమనిక. టీటీడీ ముద్రించిన 2024 ఏడాది డైరీలు, క్యాలెండర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ డైరీలు, క్యాలెండర్లను తిరుమలతో పాటుగా తిరుపతిలో అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాదు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖలోనూ విక్రయించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏపీలోని పలు పట్టణాల్లో కూడా విక్రయించనున్నారు. అంతేకాదు.. తిరుమల శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు ఆన్‌లైన్‌లో కూడా బుక్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. టీటీడీ వెబ్‌సైట్ www.ttdevasthanams.ap.gov.in ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్ టాప్ క్యాలెండర్లను భ‌క్తులు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

12 పేజీల క్యాలెండర్ -రూ.130/-, డైరీ(డీలక్స్) రూ.150/-, డైరీ(చిన్న) రూ.120/-, టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.75/-, 6 పేజీల క్యాలెండర్ రూ.450/-, శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి పెద్ద క్యాలెండర్ రూ.20/-, శ్రీ‌వారి, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి క్యాలెండర్ రూ.15/-, శ్రీ ప‌ద్మావ‌తి పెద్ద క్యాలెండర్ రూ.20/-, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30/-లుగా నిర్ణయించింది టీటీడీ.

చెన్నైలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీ‌వారి ఆల‌యాలు, ముంబ‌యి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలతో పాటుగా ఏపీలో ని పలు పట్టణాలో శ్రీవారి టీటీడీ డైరీలు, క్యాలెండర్లు లభించనున్నాయి. నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయాల కోసం అందుబాటులో ఉన్నాయి. అవసరమైన భక్తులు కొనుగోలు చేయొచ్చని టీటీడీ తెలిపింది. బుకింగ్ వెబ్‌సైట్: https://ttdevasthanams.ap.gov.in/ ద్వారా డైరీలు, క్యాలెండర్లు, పంచాంగాలను బుక్ చేసుకోవచ్చు. అవసరమైన భక్తులు బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.

Next Story