తిరుమలలో జూన్ 30 వరకు ఆయా రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజూ ఎంతో మంది భక్తులు వస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on  24 May 2024 8:47 AM GMT
Tirumala, ttd,   break darshan,  June 30th,

తిరుమలలో జూన్ 30 వరకు ఆయా రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజూ ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఇక తాజాగా విద్యార్థులకు వేసవి సెలవులు.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మరోవైపు పరీక్షల ఫలితాలు వెల్లడి కావడం కూడా భక్తుల రద్దీకి కారణం అవుతోంది. కిలోమీటర్ల మేర సామాన్య భక్తులు వేచి ఉంటున్నారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిందని టీటీడీ పేర్కొంది. వేసవి సెలవులు, ఎన్నికలు పూర్తి కావడం.. విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదల అయిన నేపథ్యంలో తిరుమలలో భక్తీ రద్దీ కొనసాగుతోందని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో అయితే సామాన్య భక్తులు 30 నుంచి 40 గంటల వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని టీటీడీ తెలిపింది. ఈ క్రమంలోనే సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించినట్లు చెప్పింది. అందుకే తాము ఒక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటనలో తెలిపింది.

సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నామని టీడీపీ ప్రకటనలో పేర్కొంది. జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో ఈ బ్రేక్‌ దర్శనం రద్దు చేయబడిందని తెలిపింది. ఇందుకు గాను సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబడవు అని పేర్కొంది. ఈ మార్పును గమనించి టీటీడీ భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. కాగా.. బ్రేక్‌ దర్శనాల సమయంలో సామాన్య భక్తులను టీటీడీ అధికారులు నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. ఇక బ్రేక్‌ దర్శనాల నిలిపివేతతో సామాన్య భక్తుల దర్శనాలకు కాస్త సమయం తగ్గే అవకాశం ఉంటుంది. టీటీడీ నిర్ణయంపై సామాన్య భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Next Story