తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  26 Aug 2024 1:08 AM GMT
tirumala, Temple, TTD, Good news,  devotees ,

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త 

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారి సేవ నవంబర్ నెల ఆన్‌లైన్ కోటా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆగస్టు 27న మంగళవారం ఉదయం 11 గంటలకు తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి నవనీత సేవకు సంబంధించిన టికెట్లను మధ్యాహ్నం 12 గంటలకు.. పరకామణి సేవకు సంబంధించి టికెట్లను మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. ఈ సేవకు సంబంధించి టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. అంతేకాదు శ్రీవారి సేవకులకు టీటీడీ ఉచితంగానే దర్శనంతో పాటూ వసతి కూడా కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

తిరుమలలో దళారులను నమ్మి చాలా మంది భక్తులు మోసపోయారు. ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. అయినా.. కొందరు వ్యక్తులు భక్తులను టికెట్ల పేరుతో మోసాలు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో టీటీడీ అధికారులు పలు సూచనలు చేశారు. తిరుమల శ్రీవారి భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారానే.. దర్శనం, ఆర్జిత సేవలు, ఇతర టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. దళారుల్ని నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఈ మేరకు టీటీడీ కోరింది. ఇటీవల కొందరు భక్తులు దళారుల్ని నమ్మి నిండా మునిగారు.. నకిలీ టికెట్లతో దర్శనం, ఆర్జిత సేవల కోసం వచ్చి టీటీడీ విజిలన్స్ సిబ్బందికి అడ్డంగా దొరికిపోయారు. అందుకే టీటీడీ అఫిషయల్ వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలంటున్నారు.

Next Story