తిరుమలలో ఆకతాయిల ప్రాంక్‌ వీడియో.. విచారణకు ఆదేశం

తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు

By Srikanth Gundamalla  Published on  11 July 2024 9:30 PM IST
tirumala, queue line, prank video, gone wrong, ttd serious,

తిరుమలలో ఆకతాయిల ప్రాంక్‌ వీడియో.. విచారణకు ఆదేశం

తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. శ్రీవారి సర్వదర్శనానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 24 గంటలు పడుతుంది. భక్తులు క్యూలైన్లలో వేచి ఉంటారు. ఈ క్రమంలోనే కంపార్టుమెంట్‌లో ఉన్న భక్తులపై కొందరు ఆకతాయిలు ప్రాంక్‌ ఈడియో చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగుతోంది.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీటీఎఫ్‌ వాసన్‌ తన స్నేహితులతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాడు. అయితే.. ఈ వారు క్యూలైన్‌లో ఉన్న సందర్భంలో నారాయణగిరి షెడ్స్‌లోని క్యూలోకి వెళ్తూ.. కంపార్ట్‌మెంట్‌ తాళాలు తీసేందుకు వస్తున్నట్లు వెళ్లాడు ఒకతను. దాన్ని వీడియో తీశారు. ఆ క్రమంలోనే కంపార్ట్‌మెంట్‌లో ఉన్న భక్తులంతా ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఆ తర్వాత యువకులంతా అక్కడి నుంచి నవ్వుతూ ప్రాంక్‌ అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో ఆకతాయి యువకులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అది కాస్త వైరల్‌ అవ్వడం వివాదం మొదలైంది.

ఈ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సాధారణంగా నారాయణగిరి షెడ్స్‌ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు ప్రవేశించక ముందే భక్తుల నుంచి సెల్‌ఫోన్లు డిపాజిట్‌ చేయిస్తారు. నిత్యం భక్తుల గోవింద నామాలతో మారు మ్రోగుతుంది. తిరుమల కంపార్ట్‌మెంట్లలో వారి మధ్యనే ఉండి ఒకరిద్దరు ఆకతాయిలు ఇలా వికృత చేష్టలకు పాల్పడటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ స్పందించింది. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్‌ విభాగం విచారణకు ఆదేశించింది.

Next Story