తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్

తిరుమల శ్రీవారిని నిత్యం ఎంతో మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.

By Srikanth Gundamalla  Published on  3 Sept 2024 7:18 AM IST
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్

తిరుమల శ్రీవారిని నిత్యం ఎంతో మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఆయన దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి ఎంతో ఇష్టమైన గరుడ సేవ రోజున రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ జారీ చేసింది. ఒక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 8వ తేదీన టీటీడీ రెండు ఘాట్‌ రోడ్లలో బైక్‌ల రాకపోకలను నిషేధించింది. అక్టోబర్‌ 4 నుంచి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా వార్షిక బ్రహ్మోత్సాలను నిర్వహించనున్నరు. అక్టోబర్ 8న అతిముఖ్యమైన గరు వాహన సేవ ఉంటుంది. 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9 ఉదయ 6 గంటల వరకు ఘాట్‌ రోడ్డులో బైక్‌లు వచ్చేందుకు అనుమతి లేదని అధికారులు చెప్పారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

మరోవైపు వినాయక చవితి దగ్గరపడుతోంది. తిరుప‌తి శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 7న వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయంలో ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయ‌క స్వామివారి మూలవర్లకు అభిషేకం, అర్చన చేప‌డ‌తారు. సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ వినాయకస్వామివారికి మూషికవాహనంపై గ్రామోత్స‌వం నిర్వ‌హిస్తారు. మరోవైపు రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉద‌యం 8 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు మూలవర్లకు అభిషేకం నిర్వ‌హిస్తారు. అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి.

Next Story