తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న ప్రభాస్

తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రభాస్ ఉదయం దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. 'ఆదిపురుష్' విజయం సాధించాలని కోరుకున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Jun 2023 9:00 AM IST
Prabhas, Tirumala Venkateswara Swamy, TTD, Adipurush

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న ప్రభాస్ 

తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రభాస్ ఉదయం దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. 'ఆదిపురుష్' విజయం సాధించాలని కోరుకున్నారు. ప్రభాస్ రాకతో తిరుమలలో సందడి నెలకొంది. శ్రీరామునిగా ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకను విష్ణుమూర్తి మరో అవతారమైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పాదాల చెంత తిరుపతిలో నేడు కన్నులపండుగగా నిర్వహిస్తున్నారు. ఆ వేడుక కోసం సోమవారం సాయంత్రమే ప్రభాస్ తిరుపతి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం తిరుమలలో దర్శనం చేసుకున్నారు. 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి వస్తున్నారు. లక్ష మందికి పైగా భక్తులు, ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకకు వస్తారని ఓ అంచనా. వేదిక దగ్గర ప్రభాస్ 50 అడుగుల హోలో గ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. తిరుపతిలో అయోధ్య భారీ సెట్ వేశారు.

ఈ ఈవెంట్‌ కోసం నిర్వాహకులు దాదాపు రూ.2 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. కేవలం బాణ సంచాల కోసమే రూ.50 లక్షల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జైశ్రీరామ్‌ అంటూ శబ్దం వచ్చేలా బాణసంచాలను తయారు చేయించారు.ఈ ఈవెంట్‌లో అజయ్ - అతుల్ జై శ్రీరామ్ పాటకు లైవ్ పార్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. 200 మంది సింగర్స్, 200 మంది డ్యాన్సర్లు ముంబై నుంచి ఈ వేడుకకు రానున్నారు.

Next Story