తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి రోజా ఫొటోగ్రాఫర్

ఏపీ మంత్రి ఆర్కే రోజా వ్యక్తిగత ఫొటో గ్రాఫర్‌ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  2 Nov 2023 2:30 PM IST
minister roja, photographer, tirumala,

తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి రోజా ఫొటోగ్రాఫర్

ఏపీ మంత్రి ఆర్కే రోజా వ్యక్తిగత ఫొటో గ్రాఫర్‌ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల మంత్రి రోజా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే.. ఆమెతో పాటు తిరుమల వెళ్లిన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌.. అన్యమత గుర్తు ఉన్న గొలుసు ధరించడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించినట్లు అయ్యింది. దీనిపై తిరుమల భక్తులతో పాటు.. ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ మంత్రి ఆర్కే రోజా వ్యక్తిగత ఫొటో గ్రాఫర్ తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించారు. మంత్రి రోజా వ్యక్తిగత ఫొటో గ్రాఫర్ స్టెయిన్ తన మెడలో అన్యమత గుర్తు ఉన్న గొలుసు ధరించారని.. అలానే గొల్లమండపం దగ్గర తిరిగారని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. మంత్రి రోజా వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెతో పాటు వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ స్టెయిన్ కూడా తిరుమలకయు వచ్చారు. తిరుమలలో అన్యమత గుర్తుల ప్రదర్శనపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. ఈ నిబంధనను పట్టించుకోని మంత్రి వ్యక్తిగత ఫోటో గ్రాఫర్‌ స్టెయిన్‌ అన్యమత గుర్తు ఉన్న గొలుసు మెడలోనే ఉంచుకున్నారు. వేసుకుని తిరుమలలో తిరగడంతో వివాదం చెలరేగింది.

అన్యమత గొలుసుతోనే స్టెయిన్‌ గొల్లమండపం సమీపంలో తిరిగారు. అతని వ్యవహారంపై తిరుమల శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తిరుమలలో అన్యమత గుర్తులపై నిషేధం ఉన్న సంగతి మంత్రి రోజాకు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. మంత్రి రోజా తిరుమల దర్శనానికి వచ్చిన ప్రతిసారి ఫొటోగ్రాఫర్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఈ సంఘటనపై టీడీపీ కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించింది. ‘‘రోజక్క తిరుమలకు ఎందుకు అన్ని సార్లు వెళ్తుందో ఇప్పుడు జనానికి ఒక క్లారిటీ వచ్చింది. నిబంధనలకు వ్యతిరేకంగా మెడలో శిలువ లాకెట్ ధరించి, ఏకంగా తిరుమల గొల్ల మండపం ఎదురుగా నిల్చుని హల్ చల్ చేస్తున్న ఇతనెవరో కాదు. రోజక్క పర్సనల్ ఫోటోగ్రాఫర్. మీకర్ధమవుతుందా?’’ అని టీడీపీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేసింది.

Next Story