తిరుమల భక్తులకు గమనిక.. ఆ ఒక్కరోజు సేవలు రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. నవంబరు 19న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది.

By Srikanth Gundamalla  Published on  18 Nov 2023 8:39 AM IST
devotees,  Tirumala, ttd,

తిరుమల భక్తులకు గమనిక.. ఆ ఒక్కరోజు సేవలు రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. నవంబరు 19న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం 6 గంటల ఉంచి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించున్నారు అర్చకులు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం అనంతరం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణమండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి పుష్పయాగం కోసం న‌వంబ‌రు 18న అంకురార్ప‌ణ కార‌ణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసింది. తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి పంచ‌మీతీర్థం సంద‌ర్భంగా తిరుమ‌ల నుండి సారె తీసుకెళ్లాల్సి ఉన్నందున‌ ఉద‌యం సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. న‌వంబ‌రు 19న పుష్ప‌యాగం రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలు ర‌ద్ద‌య్యాయి. తోమాల‌, అర్చ‌న సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

Next Story