సుప్రభాతం స్థానంలో తిరుప్పావై
No Suprabhatam from December 17th in Tirumala.కలియుగం దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సుప్రభాతం బదులు
By తోట వంశీ కుమార్ Published on
8 Dec 2021 6:00 AM GMT

కలియుగం దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సుప్రభాతం బదులు తిరుప్పావై పఠించనున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో ధనుర్మాసఉత్సవాలను అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు. డిసెంబర్ 16 మధ్యాహ్నాం 12.26 గంటల నుంచి ధనుర్మాస గడియలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17 నుంచి స్వామివాకిరి నిర్వహించే సుప్రబాత సేవ స్థానంలో తిరుప్పావై పారాయణం చేయనున్నారు. డిసెంబర్ 16 మధ్యాహ్నాం 12.26 గంటలకు ప్రారంభం అయ్యే ధనుర్మాస ఘడియలు జనవరి 14, 2022న ముగియనున్నాయి.
పురాణాల ప్రకారం.. ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం.
Next Story