శ్రీ వారి ప్రసాదం లడ్డును రాజకీయం చేయడం తగదని సుప్రీం కోర్ట్ చేసిన హెచ్చరిక ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్ కే వర్తిస్తుందని దేవాదాయ ధర్మదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అయిదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వం పై, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్ నోరు మెదకపోవడమే కాకుండా చర్యలు తీసుకోలేదన్నారు. రివర్స్ టెండర్ల పేరుతో నాసిరకం నెయ్యి సరఫరా అవుతున్న విషయం అప్పటి ఈవో కి తెలిసే మౌనం గా వున్నారా? అని ప్రశ్నించారు.
సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యలంటూ జగన్ చేస్తున్నది తప్పుడు ప్రచారం అన్నారు. నాసిరకం వస్తువులు సరఫరా చేసిన సంస్థల ఎంపికలో కక్కుర్తి పడిన అప్పటి అధికారులను, తప్పు ఒప్పుకోకుండా జగన్ రక్షించే ప్రయత్నం చేయడం లేదా.? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజలకు జవాబుదారి కాబట్టే లడ్డు కల్తీని వెలుగు లోకి తెచ్చి అప్పటి జగన్ గుత్తేదార్లు, గంగిరెద్దుల్లా తలూపిన అప్పటి టీటీడీ ఈవో లు చేసిన నిర్వాకం వల్ల, టీటీడీ శ్రీవారి ప్రసాదంలో కల్తీ నిజాన్ని వెలుగులోకి తెచ్చారన్నారు. జగన్ దేవుడు దగ్గర చేసిన తప్పులకు మే ప్రయాస్చితం చేసుకోవాల్సిన వచ్చిందన్నారు. లడ్డు విషయంలో నిజాలు వెలుగులోకి వస్తే తనకు, తను మద్దతు ఇచ్చిన అధికారులకు తగిన శిక్ష తప్పదని తెలిసే జగన్ తప్పుడు ప్రచారానికి దిగారన్నారు. సుప్రీమ్ కోర్ట్ ఇపుడు ఏర్పాటు చేసిన సిట్ అన్ని విషయాలను వెలుగులోకి తెస్తుందని.. అప్పుడు జగన్ ఏ రకంగా నోరు మెదుపుతారో చూడాలన్నారు. శ్రీవారి పట్ల భయం, భక్తి లేని వ్యక్తి జగన్ మాత్రమేనని హిందువుల భావన అన్నారు.