సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : హోం మంత్రి

శ్రీవారి లడ్డు ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

By Medi Samrat  Published on  4 Oct 2024 11:20 AM GMT
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : హోం మంత్రి

శ్రీవారి లడ్డు ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శ్రీవారి లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. తిరుపతి లడ్డు వ్యవహారంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలి.. తప్పు చేయనివారు భయపడరు.. విజిలెన్స్ ఎంక్వైరీ అంటే వైవీ సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారు.? అని ప్ర‌శ్నించారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన స్వర్ణాంధ్ర-2047 పై సమీక్ష జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు.

స్వర్ణాంధ్ర-2047 తో ప్రపంచ దేశాలలో భరతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందాలి. 2024-2029 వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు. వృద్ధిరేటు పెరిగేలా ప్రణాళికతో ముందుకు వెలుతున్నాం. గత ఐదు సంవత్సరాలగా అన్ని రంగాలను నిర్వీర్యం చేసారని.. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారని వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. .

అనకాపల్లి జిల్లా అన్ని విధాలగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. 73 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. పర్యాటక,వ్యవసాయం,పారిశ్రామిక రంగాలతో జిల్లా మరింత అభివృద్ధి చెందబోతుంది. పాఠశాలల్లో మౌలిక వసతలు కల్పిస్తున్నాం. చంద్రబాబు విజన్-2020 అంటే అందరు నవ్వుకున్నారు. హైదరాబాద్ ను అభివృద్ది చేసి చూపించారు. స్వర్ణాంధ్ర-2047లో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రతి ఒక్కరు సూచినలు, సలహాలు ఇవ్వాలని కోరారు.

జగన్ మోహన్ రెడ్డి 151 సీట్లు నుండి 11 సీట్లుకు పడిపోయారని.. ఈ వందరోజుల పాలనపై మేము చర్చకు సిద్ధం అన్నారు. సకాలంలో ఫించన్ లు ఇస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశాం. అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం, నూతన ఇసుక విధానం తీసుకువచ్చామ‌న్నారు. త్వరలో ఉచిత బస్సు, ప్రీ గ్యాస్ అందుబాటులోకి తీసుకువస్తామ‌న్నారు. చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసు అన్నారు. జగన్ చేసిన మోసాలు బయటికి వస్తున్నాయన్నారు.

Next Story