తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. గదుల కోసం ఇబ్బందులుండవ్..!
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం రోజూ పెద్ద ఎత్తున భక్తులు వెళ్తుంటారు.
By Srikanth Gundamalla Published on 30 Dec 2023 1:56 AM GMTతిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. గదుల కోసం ఇబ్బందులుండవ్..!
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం రోజూ పెద్ద ఎత్తున భక్తులు వెళ్తుంటారు. అయితే.. వారు గదుల కేటాయింపు కోసం చాలా సయమం పాటు క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుంది. అంతేకాదు.. ఈ క్రమంలో కొందరికి గదులు లభించవు. అప్పుడు ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలోనే టీటీడీ శ్రీవారి భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి మరింత సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. టీటీడీ అచ్చుతం, శ్రీపథం వసతి సముదాయాలను నిర్మిస్తోంది. ఈ మేరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి (2), శ్రీ కోదండరామస్వామి (3) సత్రాల స్థానంలో అచ్చుతం, శ్రీపథం వసతి సముదాయాలను నిర్మించేందుకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, బస తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మరింత మెరుగ్గా బస కల్పించడంలో భాగంగా తిరుమల, తిరుపతిలో ఉన్న విశ్రాంతి గృహాల్లో అవసరమైన వాఇని ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా తిరుపతిలో దాదాపు 70 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ గోవిందరాజస్వామి సత్రం (రెండో సత్రం) స్థానంలో రూ.209 కోట్లతో అచ్యుతం, శ్రీ కోదండరామస్వామి సత్రం(మూడో సత్రం) స్థానంలో రూ.209 కోట్లతో శ్రీపథం వసతి సముదాయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించిందని చెప్పారు. ఒక్కో బ్లాక్‌లో 4,100 మంది చొప్పున మొత్తం 8,200 మంది ఇక్కడ బస చేసే అవకాశాలు ఉంటాయన్నారు భూమన కరుణాకర్‌రెడ్డి. అంతేకాదు..200కి పైగా కార్లు, బైకులు పార్కింగ్ చేసుకునే సౌకర్యం ఉంటుందని చెప్పారు.
ఈ సత్రాల్లో మొదటి ఫ్లోర్‌లో రిసెప్షన్, ఎస్‌ఎస్‌డీ టోఎన్ కౌంటర్లు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లు, మెడికల్ డిస్పెన్సరీ, కార్యాల గదులు, రెండు రెస్టారెంట్లు, స్టోర్‌రూమ్, శ్రీవారి సేవకుల కోసం ఐదు హాళ్లు ఉంటాయన్నారు. రెండు, మూడు ఫోర్లలో అన్నప్రసాదం ఆలు, 500 మంది యాత్రికులు బస చేసేందుకు వీలుగా 23 డార్మిటరీ హాళ్లు, జనరల్ టాయిలెట్లు నిర్మించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. నాలుగో ఫ్లోర్ నుండి ఎనిమిదో ఫ్లోర్ వరకు ఒక్కో ఫ్లోర్‌లో 8 ఫ్యామిలీ సూట్ రూమ్‌లు, 100 గదులు, మొత్తం 540 గదులు ఉంటాయని ఆయన వెల్లడించారు.