కరోనా ఎఫెక్ట్‌.. బోసిపోయిన తిరుమల కొండ

By అంజి  Published on  21 March 2020 2:41 PM GMT
కరోనా ఎఫెక్ట్‌.. బోసిపోయిన తిరుమల కొండ

తిరుపతి: కరోనా వైరస్‌ ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌మాల్స్‌ మూసివేశారు. అయితే మహహ్మరి కరోనా ప్రభావం ప్రముఖ ఆలయాలపై సైతం పడింది. తిరుమల తిరుపతి, శ్రీశైలం, యాదాద్రి, చిలూకూరి బాలాజీ ఆలయాల్లో దర్శనాలను నిలిపివేశారు. నిత్యం వేలాది మంది భక్త జనంతో సందడిగా ఉండే ఆలయాలు పూర్తిగా వెలవెల బోయాయి.

తెలుగు రాష్ర్టాల్లోని ప్రధాన ఆలయాల్లోకి భక్తుల రాకను ఆపివేశారు అధికారులు. తిరుమల వెంకన్న ఆలయంలో కూడా భక్తుల రాకను నిలిపివేశారు. దర్శనాలను ఆపివేయడంలో తిరుమలగిరిలోని కాంప్లెక్స్ లన్నీ ఖాళీ అయ్యాయి.

Tirumala Tirupati temple

కేవలం స్వామివారికి జరగాల్సిన పూజా కైంకర్యాలను మాత్రం నిర్వహించేందుకు అర్చకులను అనుమతిస్తున్నారు. భక్త జనంతో నిత్యం స్వామి వారి నామ స్మరణతో మారుమ్రోగే కొండలు బోసిపోయాయి.

Tirumala Tirupati temple

శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించకపోవడే అందుకు కారణం. తిరుమలకు ప్రతి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నందున టీటీడీ దర్శనాలను నిలిపివేసింది.

Tirumala Tirupati temple

Next Story