నిన్న శ్రీవారిని 5,016 మంది దర్శించుకున్న భక్తులు
By సుభాష్ Published on 15 July 2020 7:27 AM IST
తిరుమలలో భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. నిన్న శ్రీవారిని 5,016 మంది భక్తులు దర్శించుకోగా, 1,493 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నట్లు టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.59 లక్షలు వచ్చింది. ఇక గురువారం శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించనన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా, కరోనా వైరస్ కారణంగా పుష్పపల్లకి ఊరేగింపును రద్ద చేసింది. అలాగే ఈనెల 30 నుంచి ఆగస్ట్ 1వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా కొన్ని రోజులుగా భక్తులను దర్శనాలను నిలిపివేసిన టీటీడీ, లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఇటీవల నుంచి పరిమిత సంఖ్యలో భక్తుల దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు. కోవిడ్ కారణంగా అన్ని చర్యలు చేపట్టి తక్కువ మంది భక్తులతో దర్శనాలు కొనసాగుతున్నాయి.
Next Story