వృద్ధురాలిని నాలుగు కిలోమీటర్ భుజంపై మోసుకుంటూ ఆస్పత్రికి చేర్చిన కానిస్టేబుల్‌

By సుభాష్  Published on  18 Dec 2019 7:37 AM GMT
వృద్ధురాలిని నాలుగు కిలోమీటర్ భుజంపై మోసుకుంటూ ఆస్పత్రికి చేర్చిన కానిస్టేబుల్‌

ఏపీలోఈ పోలసుపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన ఉద్యోగంలో భాగంగా విధులు నిర్వహించడమే కాకుండా,ఇతరులకు ఏదైన అదప వస్తే సహాయం చేయడంలో ముందుంటాడని నిరూపించుకున్నాడు. తిరుమలకు పాదయాత్రగా కాలిబాటన వెళ్తున్న ఓ వృద్ధురాలు మార్గమధ్యంలో అనారోగ్యంతో అవస్థతకు గురైంది. గమనించిన ఓ పోలీసు వచ్చి వృద్ధురాలిని భుజాన వేసుకుని సుమారు నాలుగు కిలోమీటర్లదూరం మోసుకెళ్లి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ చికిత్స చేయించాడు. ఈ పోలీసు చేసిన సాయంకు ఆమెకుటుంబ సభ్యులు ప్రశంసించారు.

రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ రెడ్డి వేలాది మంది భక్తులతో తిరుమలకు పాదయాత్రకు బయలుదేరారు. పాదయాత్రలో అన్నమయ్య కాలిబాటలో యాత్ర కొనసాగింది. పాదయాత్ర కొనసాగిస్తున్న ఓ వృద్ధురాలు మార్గమధ్యంలో అస్వస్థకు గురైంది. నడవలేని స్థితిలో కప్పకూలిపోయింది. పాదయాత్ర బందోబస్తులో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఓ స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌ గమనించి ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లి ఆమెను భుజనపై వేసుకుని ఆస్పత్రిలో చేర్చి మానవత్వాన్ని చాటుకున్నాడు. దీంతో ఈ కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్భురాజన్‌ అభినందించారు.

Next Story
Share it