కరీంనగర్‌: టిక్‌ టాక్‌ పిచ్చికి అడ్డు అదుపూ లేకుండా పోయింది. ఎక్కడ కొద్దిగా సమయం దొరికిన, ఎదైనా కొత్తగా కనిపించిన టిక్‌ టాక్‌ చేసేస్తున్నారు. ఆ తర్వాత కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని టిక్‌టాక్‌లు మనుషుల జీవితాలను నాశనం చేస్తుంటే.. మరికొన్ని టిక్‌టాక్‌లు బంధాలను ఒక్కటి చేస్తున్నాయి. అయితే తాజాగా హుజురాబాద్‌ స్థానిక ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేస్తూ.. ఆపరేషన్‌ చేసినట్లుగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇప్పుడి టిక్‌ టాక్ వీడియో ఘటన హుజురాబాద్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఓ రోగికి వైద్యులు ఆపరేషన్‌ చేస్తుండగా.. ‘సార్‌ మేం ప్లేయర్సే.. ఈ ఫుట్‌బాల్‌ ఆట మాకు తెలియదు. కానీ.. మా ఆట దడ పుట్టిస్తది’ అంటూ తమిళ హీరో విజయ్‌ బిగిల్‌ సినిమాలోని డైలాగ్‌తో టిక్‌ టాక్ వీడియో ఉంది. ఓ పక్క ఆపరేషన్‌ చేస్తూ.. ఇంకొ పక్క టిక్‌ టాక్ చేయడం ఏంటని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆ వీడియో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంఓ శ్రీకాంత్‌ రెడ్డి చెబుతున్నారు. ఆపరేషన్‌ చేసే సమయంలో తాము వీడియో, ఫొటోలు తీసి రోగి బంధువకుల చూపిస్తామని అన్నారు. ఈ మాములుగా తీసిన వీడియోను ఎవరో ఎడిట్‌ చేసి దాన్ని తీసుకెళ్లి టిక్‌టాక్‌లో పెట్టారని అన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నియోజవర్గంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు.. మంత్రి ఈటల రాజేందర్‌ను కోరుతున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.