లివింగ్ టు గెదర్ ఓకేనా..?
By రాణి Published on 22 Jan 2020 5:41 AM GMTదివ్య శ్రీ..అటు కన్నడ వీడియోలతోపాటు.. ఇటు తెలుగు వీడియోలలో తన ఓన్ డైలాగ్‌లు చెప్తూ టిక్ టాక్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ అమ్మాయి. ఇటీవల తనను పలకరించిన మీడియాతో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. తన ప్రాపర్ కర్ణాటక అయినా అక్కడి తెలుగు వారితో కలిసి మన భాషను నేర్చుకున్నట్టు చెప్పింది. ప్రస్తుతం బీఎస్సీ చదువుతున్న దివ్య శ్రీ అబ్బాయిలను తిడుతూ ఏ నాడూ టిక్ టాక్ వీడియోలు చేయలేదని తెలిపింది. ఇంకా దివ్య శ్రీ చెప్పిన మరిన్ని ముచ్చట్లు..
ఎక్కువ మంది అబ్బాయిలు లవ్, ఫ్యామిలీ, అమ్మాయి, డ్రింక్స్ మీద డిపెండ్ అవుతారు. కానీ అవన్నీ చేసేది అమ్మాయిల వల్లే. ఇవన్నీ నా చుట్టూరా జరిగే అనుభవాలను చూసి అర్ధం చేసుకున్నా. ఆరవ తరగతి నుంచే లవ్ ప్రపోజల్స్ వచ్చాయి. అలా ఇప్పటి వరకు ఎవరెవరు చేశారో..? ఎంత మంది చేశారో..? తెలీదు. వారెవ్వరూ హార్ట్‌కి టచ్ కాలేదు కాబట్టి ఓకే చెప్పలేదు.
నా హార్ట్‌కు టచ్ కావాలంటే అందం లేకపోయినా పర్లేదు. నాతో ఉన్న సమయంలో హార్ట్‌కు అనిపిస్తుంది. వాళ్లే కావాలి. ఎవరో ఒక అబ్బాయిని చూసినపుడు అలా అనిపించాలని నా ఆశ.
''అబ్బాయిలు డ్రింక్ చేసేదంతా అమ్మాయిల కోసమే, అమ్మాయిలు లవ్ యాసెప్ట్ చేస్తే హ్యాప్పీ అని తాగుతారు. తాను బ్రేకప్ చెబితే బాధతో తాగుతారు. తనను పెళ్లి చేసుకోవాలంటే లాస్ట్ మినిట్‌లో బ్యాచలర్ పార్టీ అని తాగుతాడు. పెళ్లయ్యాక తన టార్చర్ తట్టుకోలేక తాగుతాడు''
అమ్మ టైలరింగ్ చేస్తుంది. నాన్న లేరు. అన్నయ్య పోస్టాఫీసులో జాబ్ చేస్తాడు. టిక్ టాక్‌లో ఏదో ఒక టాలెంట్ చూపిస్తూ వీడియో చేస్తే ఎక్కడో ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఆ తరువాత వాళ్లకు వాళ్లే పాపులర్ అవుతారు. నేను కూడా సినీ ఇండస్ట్రీకి వెళ్దామనుకుంటున్నా. టిక్ టాక్ వీడియోలు చేసేందుకు, సినీ ఇండస్ట్రీకి వెళ్లేందుకు నా ఫ్యామిలీ సపోర్టు చేస్తుంది.
అమ్మాయి వదిలేస్తే అస్సలు పట్టించుకోకండి
''అబ్బాయిలంతా గుర్తుపెట్టుకోండి. అమ్మాయి వదిలేస్తే అస్సలు పట్టించుకోకండి. నెక్ట్స్ ఇంకో అమ్మాయి ఉంటుంది''
చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ దీక్షి, నవీన్ ఇద్దరబ్బాయిలు వర్ష అనే అమ్మాయి ఉంది. అబ్బాయిల్లో వారిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్. మోసం చేస్తారన్న భయంతో ఇంకెవర్నీ నమ్మను. నమ్మితే ఆటోమేటిక్‌గా మోసం చేస్తారు. అమ్మాయిలను అమ్మాయిలే మోసం చేస్తారు. వారి మైండే మంకీ మైండ్. సడెన్‌గా ఏది బుర్రలో ఉంటే అది చేసేస్తారు అమ్మాయిలు.
''అబ్బాయిలు డ్రింక్ చేసేది అమ్మాయిల కోసమే. కానీ డ్రింక్ చేసినా కూడా వాళ్లను ప్రేమగా చూసేది తన అమ్మ మాత్రమే. దాన్ని క్షమించే పెద్ద మనసు ఉండేది తన నాన్నకు మాత్రమే. ఉన్న ప్రేమ కోసం హ్యాపీగా ఉండకుండా లేని ప్రేమ కోసం బాధ పడటం ఏంటి బ్రో''
తెలుగు సినిమా హీరోలలో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. తమిళ్లో ధనుష్, విజయ్ దళపతి, హిందీలో షారూక్ ఖాన్ అంటే ఇష్టం. హీరోయిన్లలో కీర్తి సురేష్, సమంత అంటే ఇష్టం. పెళ్లి విషయానికొస్తే, అసలు పెళ్లే వద్దనుకుంటున్నా. ఇష్టం లేదు. లివింగ్ టు గెదర్‌లో ప్రేమ బాగుంటుంది. కానీ, దానికన్నా ఎక్కువగా గొడవలుంటాయ్. దాంతో ఇరిటేట్ వచ్చేస్తుంది. టిక్ టాక్ జర్నీ ఒక వీక్‌కు త్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఎగ్జామ్స్ టైమ్‌లో నో వీడియోస్.
''స్పీడ్‌గా డ్రైవ్ చేసినప్పుడు గుర్తుకు రాని అమ్మ నీకు దెబ్బ తగిలినప్పుడు గుర్తుకు వస్తుందా..? నీవు నీ అమ్మ అని తిట్టినప్పుడు లేని ప్రేమ నీ ఆకలిని తీర్చినప్పుడు ఆ ప్రేమ పుట్టుకొస్తుందా..? మంచిని మాత్రమే కాదు బ్రో చెడును కూడా మంచిగా మార్చే శక్తి అమ్మకు మాత్రమే ఉంది. తాను ఎప్పుడూ నీతోనే ఉంటుంది. దాన్ని గుర్తు పెట్టుకో చాలు''.